సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా ఆల్ అవుట్… దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యం

-

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో స్వల్ప విజయలక్ష్యాన్ని భారత్.. సౌతాఫ్రికా ముందు ఉంచింది. జోహెన్నెస్ బర్గ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 266 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు కేవలం 240 రన్స్ టార్గెట్ గా ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్ 85/2 నుంచి ఆటను ఆరంభించగా.. వరసగా వికెట్లు కోల్పోయి కేవలం తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. మూడో వికెట్ కు చతేశ్వరా పూజారా, అజింక్యారహానేలు 100 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. పూజారా 86 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 53 పరుగులు, రహానె 78 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌తో 58 పరుగులు చేశారు.

వీరిద్దరు అవుట్ అయ్యాక ఇండియా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వరసగా వికెట్లు కోల్పోయింది. కేవలం హనుమ విహారి కడదాకా ఉండి పోరాడాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు 40 పరుగులు చేశాడు. మిగతా వారెవ్వరూ కూడా చెప్పుకోదగిన స్కోర్ సాధించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 3 వికెట్‌ సాధించారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్‌ కాగా దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఖచ్చితంగా ఇండియా బౌలర్లు రాణించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news