హన్మకొండ వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన వరికోటి కౌషిక్ అనే యువకుడు జవహర్ కాలనీకి చెందిన ఓ యువతికి వరుసకు సోదరుడు. అయితే ఇటీవల ఆ యువతికి కౌషిక్ తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఫొటోలు ఇన్స్స్టాగ్రాంలో అప్లోడ్ చేయాలని, లేకపోతే తల్లిదండ్రులను చంపుతానని కౌషిక్ బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.