నల్లగొండ పట్టణాభివృద్ధికి పనులు చేపట్టాలి: కలెక్టర్

-

నల్లగొండ పట్టణ అభివృద్ధికి ప్రణాళికా బద్దంగా సమన్వయంతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నల్గొండ పట్టణంలో రహదారుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ పనుల పై అధికారులతో చర్చించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను జంక్షన్లుగా ఏర్పాటు చేసి ఆధునికరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news