
వికారాబాద్ జిల్లాలో రైతులు తమ పొలాల వద్ద కల్లాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి ఫైనల్ జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఎంపీడీవోలను ఆదేశించారు. బుధవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ జాబితా ప్రకారం రైతుల పొలాల వద్ద ఈ నెలాఖరు వరకు వంద శాంతం పనులను పూర్తి చేయాలనన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవ్వరికి కూడా సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు.