బోయపాటికి ఆ చెడు అలవాటు ఉంది… జగపతి బాబు..!

-

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తులసి, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రస్తుతం కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బోయపాటి శ్రీను కు ఒక చెడు అలవాటు ఉందట.

ఇది నిజమే ఈ విషయాన్ని ఒక సీనియర్ నటుడు చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు బోయపాటి శ్రీను కు ఉన్న ఆ చెడు అలవాటు గురించి ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే తెలిసి వుంటుంది. కానీ ఆ సీనియర్ నటుడు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ దర్శకుడు బోయపాటి శ్రీను కు ఉన్న ఆ చెడు అలవాటు ఏంటో తెలుసా..? బోయపాటి శ్రీను కు ఉన్న ఆ చెడు అలవాటే బూతులు మాట్లాడటం. బోయపాటి శ్రీను సెట్స్ లో వర్కింగ్ లో ఉన్న సమయంలో తెలియ‌కుండానే బూతులు మాట్లాడుతుంటార‌ట‌.

ఈ విషయాన్ని సీనియర్ నటుడు అయిన జగపతిబాబు తెలియజేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను కు జగపతిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓ పెద్ద డైరెక్ట‌ర్ ఇలా సెట్స్‌లో అలా బూతులు మాట్లాడ‌టం జ‌గ‌పతి బాబుకి న‌చ్చ‌లేద‌ట‌. దానితో జగపతి బాబు ప‌దే ప‌దే బోయ‌పాటిని బూతులు మాట్లాడటం త‌గ్గించుకోవాల‌ని చెబుతూ వ‌చ్చార‌ట‌. ఇలా బోయపాటి శ్రీను కు ఉన్న చెడు అలవాటు గురించి తాజా ఇంటర్వ్యూలో జగపతిబాబు తెలియజేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news