చండీగఢ్ నగరం అంధకారం లోకి వెళ్ళి పోయింది విద్యుత్ శాఖ కార్మికుల 3 రోజుల సమ్మె కారణంగా…. 36 గంటల నుంచి చండీగఢ్ నగరం అంధకారంలో మగ్గిపోతోంది. నగరంలోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించి పోతుంది. సోమవారం సాయంత్రం నుంచి వేలాది ఇంట్లో చిమ్మ చీకట్లో మగ్గుతుంటే… నీటి సరఫరా నిలిచిపోయి జనం అల్లాడిపోతున్నారు.
చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు సర్జరీలను వాయిదా వేసుకున్నాయి. చండీగఢ్ ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ సుమన్ సింగ్ మాట్లాడుతూ…”జనరేటర్ల సహాయంతో సర్జరీలను నిర్వహించాలనుకున్నాం. కానీ ఆస్పత్రిలో 100% లోడును జనరేటర్ పై ఉండలేం కాబట్టి.. మేము ముందుగా నిర్ణయించిన ఆపరేషన్ డెలివరీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది”అని ఆయన పేర్కొన్నారు.
ఘాటు విద్యుత్ శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిబ్బంది అలాగే ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో కేంద్రపాలిత ప్రాంతం సలహాదారు ధర్మపాల సమావేశమై సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ప్రైవేటీకరణ కారణంగా తమ ఉద్యోగ భద్రత కు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.