విశాఖలో విషాదం నెలకొంది. ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైంది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా విధి నిర్వహిస్తోందట.
ఇక రాశి గ్రామానికి చెందిన పిల్లి రాజు (26) అనే యువకుడు.. రాశిని వేధిస్తున్నాడట. ఈ తరుణంలోనే పురుగుల మందు తాగిందట రాశి. ఈ నెల 16వ తేదీన రాశి పురుగుల మందు తాగిందట. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రికి చికిత్స అందించారు. అయితే.. నిన్న మృత్యువుతో పోరాడుతూ మరణించింది. ఈ తరునంలోనే స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్టు చేసి…విచారణ చేస్తున్నారు.