బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెనూ ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులు గురి అయింది. దీంతో పైలట్ కాస్త చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సురక్షితంగా కోల్‌కత్తలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు చేరకుంది. అయితే ఈ ఘటనలో బెంగాల్ సీఎం మమత కు స్వల్పంగా వెన్ను నొప్పి వచ్చిందని బెంగాల్ రాష్ట్ర అధికార వర్గాలు ప్రకటించాయి. కాగ బెంగాల్ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ తరపున ప్రచారానికి వెళ్లారు.
తన ప్రచారాన్ని ముగించుకున్న సీఎం మమత.. వారణాసి ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కోల్ కత్తకు తిరుగు ప్రయాణం అయింది. కాగ మార్గ మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురి అయింది. అయితే సీఎం మమత సురక్షితంగా చేరుకుంది. కాగ ఈ ఘటన పై బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. డీజీసీఏ ను నివేదిక కోరింది. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా తెలపాలని డీజీసీఏను కోరింది.
కాగ సీఎం మమతా బెనర్జీ దసో ఫాల్కాన్ – 2000 అనే 10.3 టన్నుల తేలిక పాటి విమానాన్ని వినియోగించారని డీజీసీఏ తెలిపింది. ఈ విమానంలో మొత్తం 19 మంది మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని తెలిపింది. కాగ దీని పై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీజీసీఏ ప్రకటించింది.