నేడే పార్లమెంట్‌ సమావేశాలు…జమ్మూ-కాశ్మీర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న కేంద్రం

-

ఢిల్లీః ఇవాళ్టి నుంచి ‌రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 30 రోజుల తర్వాత తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే.. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ ను ఇవాళ లోక్‌సభ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మరోవైపు పలు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించేందుకు సిద్ధమౌతున్నాయి ప్రతిపక్షాలు.

పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగుల భవిష్యనిధి ( EPF) పై వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింపు, ఉక్రేయిన్ లో చిక్కుకుపోయున భారతీయుల తరలింపు లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి ప్రతిపక్షాలు.

ఇక ఇవాళ్టి నుంచి ‌రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే… నిన్న సోనియా గాంధీ నివాసంలో “పార్లమెంట్ వ్యూహ వ్వవహారల కమిటీ” సమావేశం అయింది. ఈ సమావేశంలో ఏఐసిసి సంస్థాగత వ్యవాహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, మల్లిఖార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్, చిదంబరం, గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, “ఫ్లోర్ కోఆర్డినేషన్”, ఉభయ సభల్లో భావసారూప్యతగల పార్టీలతో సమన్వయం పై చర్చించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news