వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌కుంటే.. కేసీఆర్ రాజీనామా చేయాలి : బండి సంజ‌య్

-

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వ‌రి ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. కాగ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్.. ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా.. తెలంగాణ‌లో రైతులు పండిస్తున్న ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వ‌రి ధాన్యాన్ని సీఎం కేసీఆర్ కొనుగోలు చేయ‌కుంటే.. రాజీనామా చేయాల‌ని అన్నారు. కాగ కేసీఆర్ చెబుతున్న‌వి అన్నీ కూడా అబ‌ద్ధాలే అని స్వ‌యంగా కేంద్ర మంత్రే.. ఆధారాల‌తో స‌హా నిరూపిస్తున్నారని అన్నారు.

అన్ని రాష్ట్రాల్లో వ‌రి ధాన్యం కొనుగోలు చేసేది కేంద్ర ప్ర‌భుత్వ‌మే అని తెలిపారు. యాసంగి సీజ‌న్ కు సంబంధించి వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌మ‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌లేద‌ని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ధాన్యం సేక‌ర‌ణ‌లో పెద్ద స్కాం చేస్తుంద‌ని ఆరోపించారు. కొంత మంది మిల్ల‌ర్ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం కుమ్మ‌క్కు అవుతుందని ఆరోపించారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. అలాగే లేని పంట‌ను ఉన్న‌ట్టు లెక్క‌లో చూపిస్తున్నార‌ని అనుమానం ఉంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news