మీరు ఏదైనా మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ టీవీ గురించి చూడాల్సిందే. వన్ ప్లస్ మరొక కొత్త స్మార్ట్ టీవీ ని ఇండియాలో విడుదల చెయ్యడానికి సిద్ధంగా వుంది. Y సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ టీవీలను ప్రకటించిన వన్ ప్లస్ ఇప్పుడు మరో టీవీని తీసుకు రానుంది. పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ స్మార్ట్ టీవీని 43 Y1S Pro పేరుతో తీసుకువస్తున్నట్లు టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈ టీవీని 43 ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో లాంచ్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఎప్పుడు ఇది లాంచ్ కానుంది అనేది తెలియదు. ఈ టీవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క రెండు ఫీచర్లను ఇప్పటికే తెలిపింది.
ఈ టీవీని HDR 10 డీకోడింగ్ తో తీసుకు వస్తున్నారు. అలానే ఎడ్జెస్ మంచిగా రూపొందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇండియాలో విడుదల చేసిన Oneplus TV Y1S సిరీస్ నుండి వచ్చిన 32 ఇంచ్ మరియు 43 ఇంచ్ సైజులో స్మార్ట్ టీవీలు వచ్చాయి. ఇక వాటి ఫీచర్స్ గురించి కూడా చూద్దాం. ఈ టీవీ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD రెడీ (1366×768) రిజల్యూషన్ తో వచ్చింది.
గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. Dolby Audio సౌండ్ టెక్నాలజీ కూడా వీటికి వుంది. 20W సౌండ్ అవుట్ పుట్ ని కూడా ఇవి అందిస్తాయి. Android 11 OS తో ఇవి పని చేస్తాయి. 3HMDI (1HDMI Arc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.