తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ లో ఆరు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ లో గేమ్ బాగా ముందుకు వెళ్తున్న టాప్ కంటెస్టెంట్ గా బిందు మాధవి ఉంది. కాగా, ఈమె ఆటపై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వస్తున్నాయి. తన తమిళ్ తెలివి తేటలను హౌజ్ లో బిందు మాధవి ప్రదర్శిస్తున్నదని, అందుకే అలా ముందుకు వెళ్లగలుతున్నదని కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పైన ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. అయితే, ఆటను ఆటగా చూడాలని బిందు మాధవి తన ఆటను పర్ఫెక్ట్ గా ఆడుతున్నదని పలువురు చెప్తున్నారు. తమిళ్, తెలుగు, మలయాళం అంటూ భాషలు, ప్రాంతాల గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం రీజినల్ బ్యారియర్స్ అనేవి అస్సలే లేవని పేర్కొంటున్నారు.
ఆ మాటకొస్తే బిందు మాధవి తమిళ్‌లో కొంత కాలం సెటిల్ అయిపోయనప్పటికీ ఒరిజినల్ ఆరిజిన్ ఉమ్మడి ఏపీనేనని వివరిస్తున్నారు. బిందు మాధవి ఆటను పరిశీలించిన బీబీ లవర్స్ , రివ్యుయర్స్ సైతం ఆమె ఆటను ప్రశంసిస్తున్నారు.
ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బిందు మాధవి చక్కగా గేమ్ ఆడుతున్నదని, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూనే , ఆట విషయంలో పట్టు సాధించిందని అంటున్నారు.ఈ క్రమంలోనే తను బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అవుతాననే ధీమాను అవసరమైనప్పుడు వ్యక్తం చేస్తున్నదని మెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఆరు వారాలు ముగిశాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో బిందు మాధవియే నిలిచింది. చూడాలి మరి.. చివరి వరకు ఈమెనే విన్నర్ గా నిలుస్తుందో లేదో..