మీ షూ నుండి దుర్వాసన వస్తోందా..? అయితే ఇలా ఫాలో అవ్వండి..!

-

ఉదయం నుండి షూ వేసుకుని పని చేస్తూ ఉంటాం దీంతో దాని నుండి దుర్వాసన కలుగుతుంది ముఖ్యంగా వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది దీంతో దుర్వాసన బాగా ఎక్కువ వస్తుంది. పైగా శుభ్రంగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే షూ నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? వేటిని ఫాలో అవ్వడం వల్ల షూ నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

 

పండ్ల తొక్కలు తో దుర్వాసనని తొలగించండి:

షూ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే పండ్ల తొక్కలను మీరు ఉపయోగించి దుర్వాసనని తొలగించొచ్చు. కమలా తొక్కలు కానీ నిమ్మతొక్కలను కానీ మీరు రాత్రిపూట షూ లో పెడితే దుర్వాసన మొత్తం పోతుంది. ఉదయాన్నే వాటిని తొలగించండి దీనితో మీ షూ నుండి దుర్వాసన రాదు.

షూ ని తరచుగా ఉతకండి:

మీరు మీ షూ ని చేత్తో ఉతకడం చాలా బెస్ట్ ఆప్షన్ దీని వల్ల దుర్వాసన మొత్తం పోతుంది. అలానే క్రిములన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఉతికిన తర్వాత వాటిని బాగా ఆరనివ్వాలి. ఇలా మీరు షూ నుండి దుర్వాసన తొలగించొచ్చు.

డిస్ ఇంఫెక్టెడ్ స్ప్రే ని కొట్టండి:

షూ నుండి దుర్వాసన వస్తున్నట్లయితే మీరు మీ జాబ్ నుండి వచ్చిన వెంటనే డిస్ ఇంఫెక్టెడ్ స్ప్రే ని కొట్టండి. దీనితో క్రిములు మొత్తం పోతాయి. అలానే దుర్వాసన కూడా తొలగిపోతుంది. ఫ్రెష్ గా ఉంటాయి.

మీ పాదాలకు డియోడ్రెంట్ రాసుకోండి:

మీ పాదాలకు మీరు డియోడ్రెంట్ రాసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఫంగస్ రావు. దానితో షూ కి ఎలాంటి బ్యాక్టీరియా సోకదు. మంచి డియోడ్రెంట్ ని ఉపయోగించడం మంచిది లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news