స్ఫూర్తి: పొద్దుతిరుగుడు సాగుతో ఏడాదిలో రూ. 6 లక్షల లాభాన్ని పొందుతున్న రైతులు…!

-

అందరూ ఎంచుకున్న ఫీల్డ్ లో సక్సెస్ అవ్వలేరు. నిజానికి వాళ్ళకి నచ్చి చేసిన సరే ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంటుంది. అలానే కొంతమందిని చూసుకుంటే నచ్చని ఫీల్డ్ లోకి వెళ్తారు. దీంతో అసంతృప్తి వాళ్లలో ఎక్కువగా ఉంటుం.ది అయితే జీవితంలో మనం సక్సెస్ పొందాలి అంటే మనకు నచ్చింది చేయాలి. అలాగే అందులో మనం విజయం సాధించాలి.

 

అప్పుడు సంతృప్తి ఉంటుంది. అదే విధంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రైతు కూడా తనకు నచ్చినట్లుగా అనుసరించి మంచిగా సక్సెస్ ని పొందారు. గుజరాత్లోని రాజ్కోట్ కి చెందిన రామ్ పొద్దు తిరుగుడు సాగు మొదలుపెట్టారు. పదివేల రూపాయలతో మొదలు పెట్టిన ఈ సాగు ఏడాదిలో ఆరు లక్షల రూపాయలను తీసుకు వచ్చింది. రామ్ తన పొద్దు తిరుగుడు పూల పెంపకం ద్వారా ఎంతో తృప్తి పడుతున్నారు.

పైగా విజయం సాధించడం ఆనందంగా ఉంది అని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు సాంప్రదాయ వ్యవసాయం లో లాభాలు రావడం లేదని ఇతర దారులని ఎంపిక చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా మంది సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పూల సాగు ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు.

పైగా రామ్ కి ఉన్న భూమిలో జొన్న గోధుమ మొదలైన వాటికి బదులుగా పొద్దు తిరుగుడు సాగు చేయడం మొదలుపెట్టారు. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. పొద్దు తిరుగుడు సాగు ద్వారా ఇంత లాభమా అని అంతా కూడా అతన్ని అడుగుతున్నారు. ఈయన చేసిన సాగు యొక్క ప్రాముఖ్యత చుట్టుపక్కల వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రైతు ఆరు లక్షల రూపాయలను పొద్దు తిరుగుడు సాగు ద్వారా సంపాదించడంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మనసుంటే మార్గం ఉంటుంది అని… కష్టపడితే ఖచ్చితంగా సాధించొచ్చు అని ఈ రైతు రుజువు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news