5 ఏళ్ల కొడుకు తన తల్లికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. చాలా మందికి పెళ్లి అంటే ఒక పెద్ద కల. అలాంటి సందర్భం కోసం ఎంతో మంది వేచి చూస్తుంటారు. నచ్చిన వ్యక్తిలో జీవితం పంచుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మన భారతదేశంలో పెళ్లి పద్దతులు వేరు. ఫారన్ కంట్రీస్‌లో పెళ్లి ప్రపోజల్స్ వేరు. అక్కడ తమకు నచ్చిన భాగస్వామిని రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. అలాంటి పెళ్లి ప్రపోజల్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోలో 5 ఏళ్ల బాలుడు వీడియోను క్యాప్చర్ చేస్తుంటారు. తన తల్లిని తండ్రి పెళ్లి ప్రపోజ్ చేస్తాడు. అయితే, తన తల్లిని ప్రపోజ్ చేస్తున్నప్పుడు బాలుడు ఎంతో ఎక్సైట్ అయినట్లు కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తను మాట్లాడిన మాటలకు చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
బూమ్ షకలకా అంటూ పిల్లాడు కేరింతలు కొడుతుంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ప్రేమతో కూడిన ఎమోజీలు పంపిస్తున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 2 మిలియన్స్ వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.