దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా తో తన రేంజ్ ను మార్చుకున్న ఈయన ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన తండ్రిని మించిన తనయుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను రాయడం గొప్ప విషయం అనే చెప్పాలి. ముఖ్యంగా రాజమౌళి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి శాంతినివాసం అనే సీరియల్ ను తెరకెక్కించారు.
ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసి మంచి విజయం సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం ఆయన భార్య రమా రాజమౌళి కూడా డిజైనర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా జక్కన్న సినిమాలకు పని చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా రాజమౌళికి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఆయన తన సినిమాలకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న ట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఆయనకు రూ.400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఖరీదైన కార్ల తో పాటు స్థిరాస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరే స్టార్ హీరో తో తన సినిమా తెరకెక్కిస్తారో తెలియాల్సి ఉంది.