క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో ఇంత లగ్జరీ లైఫ్ .. తెలిస్తే షాక్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.. ఇందులో కొంతమంది ప్రస్తుతం బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది అయితే హీరోలకు సమానంగా వారి యొక్క రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయమే నిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏదైనా సినిమా ఫ్లాప్ అయింది అంటే చాలు హీరోకి ,నిర్మాతకు, డైరెక్టర్ కు మాత్రమే ఎక్కువ నష్టాలు వస్తున్నాయి ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం ఎటువంటి నష్టం ఉండదు.

ఒకవేళ వారు లేకుండా సినిమాలను తీసినట్లు అయితే ఆ సినిమా దారుణంగా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన ఒకరు ప్రతిరోజు తన రెమ్యూనరేషన్ రూ 5 లక్షలకు పెంచారని టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా వారికి రెండు కార్లు కూడా కావాలి.. వారి అన్ని సదుపాయాలు చేసిన కూడా వారు సమయానికి రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక వీరితోపాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రతిరోజు తన రెమ్యూనరేషన్ రూ.3.5 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది.

ఇక అంతే కాకుండా తెలుగులో టాప్ కమెడియన్లు సైతం ప్రతిరోజు రూ.4 నుంచి 5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారట. అందుచేతనే వాళ్ళు సీన్లను వీలైనంతవరకు తగ్గించి బడ్జెట్ను కూడా తగ్గించుకోవాలని పనిలో నిర్మాతలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కో చిత్రానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు దాదాపుగా 30 నుంచి 60 రోజుల వరకు షూటింగ్లో పాల్గొనవలసి ఉంటుంది అంటే దాదాపుగా రూ.2 కోట్ల రూపాయల వరకు వారి ఖర్చు వస్తుందని అంచనా. ఇక దీంతో నిర్మాతలు,డైరెక్టర్లు సైతం వీలైనంతవరకు క్యారెక్టర్ ఆర్టిస్టులను తగ్గించి సినిమాలను తెరకెక్కించే ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం. ఇక విరే కాకుండా జబర్దస్త్ నుంచి వచ్చిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గకపోవడంతో నిర్మాతలు వీరు పైన కూడా చాలా కోపంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news