సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట

-

ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తు, అరెస్ట్, ఆస్తుల స్వాధీనం వంటివి ఈడికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈడి దర్యాప్తు, అరెస్ట్, ఆస్తుల స్వాధీనాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తు సంస్థలు పోలీసు వ్యవస్థ కాదని.. విచారణలో భాగంగా ఆ సంస్థలు రికార్డు చేసే స్టేట్మెంట్లు, విలువైన సాక్షాలుగా చెల్లుబాటు అవుతాయని ధర్మాసనం పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఈడి దాడులు పెరుగుతుండడం, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించాక ఈడి కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే మూడు రోజులపాటు సోనియాని అధికారులు ప్రశ్నించారు. మూడు రోజుల్లో మొత్తం 12 గంటల పాటు ఈడి అధికారులు ఆమెను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news