టాలీవుడ్ కాంట్రవర్సీ దర్శకులలో రాంగోపాల్ వర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఈయన ఏ ట్వీట్ చేసిన సరే తనదైన శైలిలో వివాదాలకు దారితీస్తూ ఉంటుంది అందుకే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని అంటూ ఉంటారు. అందరూ ఒకప్పట్లో మాస్, యాక్షన్, ఎలివేషన్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించిన ఈయన కాలక్రమమైన తన వృత్తిలో మార్పు రావడంతో అన్ని అడల్ట్ సినిమాలు చేస్తూ పూర్తిగా తన గౌరవాన్ని కోల్పోయారు అని చెప్పవచ్చు. అంతేకాదు హీరోయిన్ల అందాలను బయట పెట్టడంలో వర్మ తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినీ ఇండస్ట్రీలో నిర్మాతల బంధ్ గురించి మాట్లాడిన వర్మ నిర్మాతలలో సీరియస్ నెస్ తెప్పించాలని ఇలా షూటింగులు బంద్ చేస్తున్నారని వర్మ కామెంట్లు చేశారు . మగధీర సినిమా రూ.75 కోట్లు సాధిస్తే.. బాహుబలి వన్ కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వర్మ తెలిపారు. ప్రతి హీరో కూడా ఇంకో హీరో కంటే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటారని వర్మ స్పష్టం చేశారు. ఇక ఆ సమయంలో ఎంత మొత్తమైన ఖర్చు చేసే నిర్మాతల కోసం హీరోలు ప్రయత్నిస్తారని వర్మ వెల్లడించారు. ఇకపోతే 100 సినిమాలు చిన్న సినిమాలు ఉంటే డీజె టిల్లు లాంటి సినిమా హిట్ అవుతుందని వర్మ తెలిపారు.సినిమా వేర్వేరు కారణాల వల్ల ఆడుతాయని తెలిపిన వర్మ జయప్రద అందాల కోసం , డైలాగ్స్, కామెడీ కోసం అడవి రాముడు సినిమాను ఏకంగా 17 సార్లు చూశానని వర్మ చెప్పుకొచ్చారు. ఇక సినిమా అనేది కథ వల్ల ఆడదని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.