ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా.. రోజా , ఆమనీ హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం శుభలగ్నం. ఇక ఈ సినిమా వర్షాకాలంలో విడుదలైంది. అయితే వర్షాలను కూడా లెక్కచేయకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ముఖ్యంగా మహిళ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకర్షించిందని చెప్పవచ్చు.. ఇక జగపతిబాబు అమాయకపు నటన , భర్తను కోటి రూపాయలకు అమ్మేసి.. ఆ తర్వాత కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని..కోటి రూపాయలకు కొనుక్కున్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకు అండగా ఉండే పాత్రలో రోజా ఇలా ముగ్గురు ఎవరికివారు అదరగొట్టేసారని చెప్పవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగి పాత్రలో జగపతిబాబు పూర్తిస్థాయి ప్రేక్షకులను అలరించారు.
ఇక ఇంతటి అద్భుతమైన సినిమా గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.. ఒకసారి భరద్వాజ తమ్మారెడ్డి దగ్గరకు మాటల రచయిత దివాకర్ బాబు వెళ్లి భూపతి రాజు దగ్గర ఉన్న రెండు కథల్లో ఏది బాగుందని అడిగితే.. కోటి రూపాయలకు భర్తను అమ్మేయడం బాగుందని చెప్పారట. అయితే ఆ కథ కాకుండా మరో కథ నచ్చిందని దొంగ రాస్కెల్ పేరుతో స్టార్ట్ చేశారు
ఈలోగా కృష్ణారెడ్డి, అశ్వినీ దత్ కాంబినేషన్లో సినిమా కోసం చర్చ సాగుతుంటే భూపతి రాజు తన దగ్గర ఉన్న కథ గురించి దివాకర్ బాబుకు చెప్పారు. అందరికీ నచ్చింది.. రిస్క్ అయినా సరే చేయాలనుకున్న దివాకర్ బాబు మూడు రోజుల్లోనే మాటలు రాసేశారు. స్క్రిప్ట్ సిద్ధం.. హీరో జగపతిబాబు సెలెక్ట్ అయ్యాడు.. హీరోయిన్ గా రాధా పాత్రకు ఆమని సెలెక్ట్ చేశారు. ఇంకో పాత్రకు రోజా ఓకే. 1994లో అన్నపూర్ణ స్టూడియోలు శుభలగ్నం సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.
చిలక ఓ తోడు లేక సాంగ్ కోసం మూడు షాట్స్ ముంబై సముద్రపు ఒడ్డున, రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరించడం జరిగింది.ఇక 1994 అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా అప్పటికే అశ్వమేధం, సరిగమలు, గోవిందా గోవింద సినిమాలు ఫ్లాప్ అయి నిరాశతో ఉన్న అశ్విని దత్ కి శుభలగ్నం సినిమా మంచి ఎనర్జీని అందించింది.అంతేకాదు ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెండి నందిని బహుమతిగా బహుకరించారు. ఇక సిరివెన్నెల రాసిన చిలుక ఏ తోడు లేక అనే పాటకి నంది అవార్డు లభించింది . మద్రాస్ లో శుభలగ్నం సినిమా 150 రోజుల సక్సెస్ ఈవెంట్ జరిగినప్పుడు ..ఈ వేడుకకు చిరంజీవి , నాగార్జున కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.