బీహార్లో పవన్ కళ్యాణ్ రేంజే వేరబ్బా.. హీరోయిన్ సంచిత..!

-

పవన్ కళ్యాణ్ సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కాకపోయినా ఆయన కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం దేశవ్యాప్తంగా విపరీతంగా ఉంది. ఇకపోతే బీహార్లో ఎలా ఆయన ఫాలోయింగ్ పెరిగిపోయింది అనే విషయాన్ని ప్రముఖ హీరోయిన్ సంచిత ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిది నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో.. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని పొందిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి ,టిక్ టాక్ స్టార్ సంచిత భాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇకపోతే సెప్టెంబర్ రెండవ తేదీన విడుదలవుతున్న సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ సంచితా బాసు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక అందులో భాగంగానే విడుదలై ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలో లయ అనే పాత్ర నేను పోషిస్తున్నాను నేను టిక్ టాక్ వీడియోలు చేసే లయ పాత్రలో నటిస్తున్నాను. నేను ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ను.. పవన్ కళ్యాణ్ అభిమానితో ప్రేమలో పడతాను.. ఖుషి సినిమా రిలీజ్ రోజున ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ కావాలని అడుగుతాను.. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ బీహార్ లో మంచి ఫాలోయింగ్ లో సొంతం చేసుకున్నారు. నిజానికి బీహార్ వాసులకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఖుషీ సినిమా హిందీ వర్షన్ లో చూశాను అది బాగా నచ్చింది అంటూ సంచిత తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news