ఎల్‌పీజీ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సిలిండర్లు బుక్ చేయడం పైన లిమిట్ ని పెట్టనుంది ప్రభుత్వం. ఈ విషయం పలు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఇక నుండి ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే అనుమతి వుంటుందట.
ఈ లిమిట్ కనుక దాటితే ఎక్స్ట్రా గ్యాస్ సిలెండర్లని బుక్ చేసేందుకు అవ్వదట. కేవలం కేటాయించినన్ని సిలెండర్లను మాత్రమే బుక్ చేసుకోవాలని పలు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. నెలకు కేవలం రెండే బుక్ చేసుకోవాలట. ఆ లిమిట్ దాటి బుక్ చేసేందుకు కుదరదు. అక్టోబర్ 1 నుంచే ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని ఎల్‌పీజీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే ప్రతీ నెల కూడా సిలెండర్ రేట్లు మారుతూ వస్తాయి. ప్రతీ నెలా కూడా ఒకేలా వుండవు. పైగా అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకే విధంగా వుండవు. ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. రాష్ట్రాల్లోని వాల్యూ యాడెడ్ ట్యాక్స్, రవాణా ఛార్జీలు బట్టీ ఈ రేట్లు ఉంటాయి. ఐఓసీ ప్రకారం ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1053, ముంబైలో రూ.1052.5, చెన్నైలో రూ.1068.5, కోల్‌కతాలో రూ.1079గా సిలెండర్ ధరలు వున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త గ్యాస్ ధరలు అమలులోకి వచ్చాయి. కనుక వినియోగదారులు గమనిస్తే మంచిది.