రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ భవన్ లో ఉంచుతారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలను నిర్వహిస్తారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున కన్ను మూసిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఏషియన్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి తరలించారు.
జైపాల్ రెడ్డి అంత్యక్రియలను నెక్లెస్ రోడ్ లోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన నిర్వహించనున్నారు. పీవీ ఘాట్ పక్కనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ భవన్ లో ఉంచుతారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కన అంత్యక్రియలను నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎంపీ రేవంత్ రెడ్డి.. జైపాల్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి పీవీ ఘాట్ వద్ద అంత్యక్రియల కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు.