కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎన్నొ సార్లు తన నటన తో అందరినీ డామినేట్ చేస్తుండే వాడు. గతంలో అతని డేట్స్ కోసం అనేక మంది నిర్మాతలు ప్రకాష్ రాజ్ ఇంటి ముందు బారులు తీరి వుండేవారు. ఇక తాను సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనే వారు. ప్రస్తుతం ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూ లో రాజకీయాలపై తన వ్యాఖ్యల వల్ల తనకు అవకాశాలు లేకుండా పోయాయని సంచలన కామెంట్స్ చేసారు. ఇక ప్రకాష్ రాజ్ బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారని తెలిసిందే. రీసెంట్ గా నటుడు విశాల్ మోదీ ని పోగొడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై కూడా మోదీ ఉద్దేశించి విమర్శలు చేసాడు.
ఇక ఆయన మాట్లాడుతూ నేను ఒక పార్టీ పై మాట్లాడటం వల్ల గతంలో నాతో కలిసి పని చేసిన వారు ఇప్పుడు నాతో నటించడానికి భయపడుతున్నారు. నాతో నటిస్తే ఎలా అనే భయం వారిలో ఉంది. అయితే ఈ విషయంలో నాకుఏ మాత్రం బాధలేదు. నా భయం మరొకరికి శక్తిగా మారొద్దు. నాకు సినిమా అవకాశాలు రాకపోయినా పరవాలేదు.కాని నేను మాత్రం తగ్గను, నా రూటు మార్చుకోను అని ఘాటుగా వ్యాఖ్యానించారు