టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (TET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. టెట్ పరీక్ష రాసేందుకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కన్నారు.
2025 జనవరి 2 నుంచి 20 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహిస్తారని తెలుస్తోంది. సాంకేతిక సమస్య వలన జనవరి 11వ తేదీన ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాట్ టెకెట్లు రేపు (శనివారం) అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వెల్లడించింది.