వామ్మో..ఇతను మనిషా?జంతువా? వణికిపోతున్న జనాలు..

-

ఈ ఫోటోలోని వ్యక్తి ఓ మనిషే..కానీ తెలియని జనాలు అతన్ని చూసి ఓ మృగంలా భావించి దూరంగా పరుగులు తీస్తున్నారు.అతడి రూపం భయంకరంగా ఉంటుంది. ఒళ్ళంతా వెంట్రుకలే..వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ నంద్ లేతా గ్రామానికి చెందిన లలిత్ పాటిదార్ వయసు 17ఏళ్లు. అతడి శరీరం మొత్తం అంటే.. టాప్ టు బాటమ్.. వెంట్రుకలే. లలిత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అదే hypertrichosis (వెంట్రుకలు విపరీతంగా పెరగడం). దీన్ని werewolf syndrome అని కూడా అంటారు..

 

అతనికి ఈ వ్యాధి ఆరేళ్ళ వయస్సులో బయట పడింది.అప్పటి నుంచి అతడి శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమైంది. తాను చూడటానికి తోడేలులా ఉంటానని, కరుస్తానేమో అని.. స్కూల్ లో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ వాపోయాడు. వెంట్రుకలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటానని లలిత్ చెప్పాడు. కాగా, మధ్యయుగం నాటి నుంచి కేవలం 50 మందికే ఈ వ్యాధి వచ్చిందని, దీనికి చికిత్స లేదని డాక్టర్లు తెలిపారు.

మొత్తం శరీరం అంతా వెంట్రుకలు ఉండటంతో అతన్ని స్నేహితులందరూ మంకీ బాయ్ అని పిలుస్తారు. వెంట్రుకలు మొలుస్తున్నా భయపడే వాడిని కాదు..ఆరేళ్ళ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది..అరుదైన వ్యాధి అని..50 మందికి మాత్రమే ఈ వ్యాధి ఉంది. మా ఇంట్లో ఎవ్వరికి లేదు..నాకు వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.నా పరిస్థితి గురించి నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడుతున్నారు అని లలిత్ వెల్లడించాడు. నన్ను చూసి పిల్లలు జడుసుకునే వారు.

చిన్న వయసులో నాకు అర్థం కాలేదు. వయసు పెరిగాక అర్థమైంది. పిల్లలు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో తెలిసింది. నేను మృగంలా కరుస్తానేమో అని పిల్లలు భయపడే వారని లలిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. వెంట్రుకలు బాగా పెరిగితే.. ట్రిమ్ చేస్తానని లలిత్ తెలిపాడు. అది తప్ప తన దగ్గర మరో మార్గం లేదన్నాడు. అరుదైన వ్యాధి వేధిస్తున్నా.. ఒళ్లంతా వెంట్రుకలు ఇబ్బంది పెడుతున్నా.. నేను నిరాశపడను అని లలిత్ అంటాడు.ఎప్పటికప్పుడు సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం..నిజంగా గ్రేట్ అని అందరూ అతన్ని అభినందించారు..

Read more RELATED
Recommended to you

Latest news