బన్నీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

-

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస అవకాశాలను అందుకొని కథలు ఎంపిక విషయంలో అంతే జాగ్రత్త వహిస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకో గలుగుతారు. లేకపోతే ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వారిలో గౌరీ ముంజల్ కూడా ఒకరు. అల్లు అర్జున్ హీరోగా బన్నీ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన గౌరీ ముంజల్ గురించి.. ఆమె నటన , అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. వివి వినాయక్ దర్శకత్వంలో స్టార్ హీరో సరసన హీరోయిన్ గా రావడం ఈమె కెరియర్ కు ప్లస్ అయ్యింది.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.మొదటి సినిమాతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాలలో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేక పోయింది. మరి తెలుగు సినిమాల విషయానికి వస్తే.. బన్నీ, శ్రీకృష్ణ 2006, గోపి గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామా , బంగారు బాబు లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది .కానీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు.చివరిసారిగా 2009లో జగపతిబాబు హీరోగా వచ్చిన బంగారు బాబు చిత్రంలో నటించి ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరం అయింది.

ప్రస్తుతం ఢిల్లీలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న గౌరీ ముంజల్ సినిమాలపై ఆసక్తి చూపకుండా పలు వ్యాపారాలను చూసుకుంటున్నట్లుగా సమాచారం. ఏదేమైనా సినీ కెరియర్ కు దూరమైనప్పటికీ వ్యాపారం విషయంలో మంచి సక్సెస్ పొందుతూ భారీగా డబ్బు వెనకేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె అభిమానులు మాత్రం గౌరీ మళ్ళీ సినిమాలలోకి రావాలని కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు గౌరీ మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news