ఫేమ్ కోసం చాలా జాగర్త పడుతున్న హీరో నిఖిల్..!!

-

హీరో నిఖిల్ అదృష్టం మామూలుగా లేదు. వాస్తవానికి కార్తీకేయ 2 ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవ్వరూ అంచనా వేయలేదు. తన ఎప్పుడో పూర్తి అయినా కూడా రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటికే బడ్జెట్ 30 కోట్లు దాటి రిస్క్ లో పడింది. కాని దేవుడు గీసిన స్క్రిప్టు లాగా కృష్ణ దేవుని మీద తీసిన సినిమా సరిగ్గా కృష్ణాష్టమి వారంలో రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు వర్షం కురిపించింది.

ఇక తన సినిమా కు ఇరవై కోట్లు పెట్టడమే ఎక్కువ అనుకునే సమయంలొ తనకి ఇలాంటి సూపర్ హిట్ వచ్చింది. దీనితో ఏ మాత్రం తొందర పడకుండా నిఖిల్ సిద్ధార్థ్ తెలివిగా ముందుకు వెళుతున్నాడు.గతంలో తాను నటించిన 18 పేజెస్ విడుదల కు సిద్ధంగా ఉంది.చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

కార్తికేయ 2 సూపర్ హిట్ అవ్వడంతో నిఖిల్ 18 పేజెస్ పై అంచనాలు పెరిగిపోయాయి. దీనితో నిఖిల్ ఎప్పుడో రెడీ అయిన సినిమాను మళ్లీ నిర్మాతల తో కలిసి చూసి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని  చూస్తున్నారు.డిసెంబర్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు.  కానీ ఇప్పుడు మళ్లీ కు సంబంధించి షూటింగ్ జరపనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ లోగా షూటింగ్ చేసి కలపాలని చూస్తున్నారని తెలుస్తోంది. నిఖిల్ కూడా వచ్చిన క్రేజ్ ను పోగొట్టుకొనే దిశగా లేడని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news