మన్యం జిల్లాలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగాంగానే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సాలూరు నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది. ఈ మేరకు విశాఖ నుంచి సాలూరు రోడ్డు మార్గంలో రానున్నారు. సాలూరు డిగ్రీ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

సాలూరు నుంచి బయలుదేరి మక్కువ మండలం బాగుజోల గ్రామానికి చేరుకుంటారు.. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. బాగుజోల వద్ద రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం అక్కడ గిగిజనులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.