తెలంగాణ సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ప్రశంసలు కురిపంచారు. తెలంగాణ దేశానికే ఆదర్శమని చెప్పారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం ప్రారంభం అయింది.
తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది.. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించిందన్నారు గవర్నర్ తమిళి సై.
తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయ్యింది.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం.. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశాం. మా ప్రభుత్వం రైతులకు బీమా అందిస్తోందన్నారు గవర్నర్ తమిళిసై.