తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు.. చేసిన అభివృద్ధిపై తమిళిసై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై గవర్నర్ తమిళిసై ప్రశంసలు కురిపించారు.
‘కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. కాళేశ్వరం.. మహా అద్భుతంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సాగు 20 లక్షల ఎకరాల నుంచి 73.33 లక్షల ఎకరాలకు పెరిగింది. త్వరలో కోటి ఎకరాలకు పైగా సాగునీరందిస్తాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. రైతుబంధు పథకాన్ని ఐరాసలోనూ ప్రశంసించారు. రైతు బీమా సదుపాయం ప్రపంచంలో మరెక్కడా లేదు. ధాన్యం ఉత్పత్తి 68.17 లక్షల టన్నుల నుంచి 2.02 కోట్ల టన్నులకు చేరింది. రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.