ఏపీ లాయర్లకు మరో శుభవార్త. ‘వైయస్సార్ లా నేస్తం’ పథకాన్ని ఇకపై 6 నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి రెండు దఫాలుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఒకేసారి పెద్ద మొత్తం ఇస్తే అది వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఈ మార్పు చేస్తున్నామని వెల్లడించారు.
జూనియర్ న్యాయవాదుల మీద మరింత దృష్టి పెట్టడంతో పాటు ప్రభుత్వం తోడుగా ఉందనే భావన వారిలో కలగాలనే ఉద్దేశంతోనే మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ. కోటి 55వేలను లా నేస్తం పథక ఆర్థిక సాయాన్ని తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ బుధవారం బటన్ నొక్కి జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయవాది వృత్తిని ఎంచుకుని, అందులో స్థిరపడటానికి తొలి మూడేళ్లలో ఉండే ఇబ్బందుల్ని తొలగించడానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.