ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగ

-

ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగ నిర్వహించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్న సందర్భంగా 28, 29, 30 తేదీల్లో పట్టణంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో రైతు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందున ఆ సదస్సును విజయవంతం చేయాలని చెప్పారు.

CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news