NTR30 : ఎన్టీఆర్ మూవీలో అఖండ విలన్ ?

-

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తన 30 వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ హీరోయిన్ల ఎంపిక విషయంలో కొంచెం తడబాటు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా, తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్.. అఖండ మూవీలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news