మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ రివీల్ చేసిన మంజుల..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన అందం, క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన వయసు 47 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా యంగ్ హీరో అందంతో పోటీ పడుతూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. మరి మహేష్ బాబు ఇంత అందంగా ఉండడానికి గల రహస్యాన్ని మంజుల రివీల్ చేశారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటారు. అలాగే ఆమె కూతురు మంజుల కూడా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించదు. ఇప్పుడు ఘట్టమనేని వంశంలో అందరూ కూడా ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహేష్ గ్లామర్ గురించి తదితర అంశాల గురించి ఆయన సోదరి మంజుల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడని ఒత్తిడికి దూరంగా ఉంటాడు అని చెప్పుకొచ్చింది.

ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టే అంత ఉన్నాడు గతంలో కింగ్ నాగార్జునను ఫిట్నెస్కు కేరాఫ్ అడ్రస్ అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఫిట్నెస్, గ్లామర్ విషయంలో మహేష్ బాబు ఇచ్చే ప్రయారిటీ చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే పలు సినిమాలలో కూడా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక గ్లామర్ విషయంలో కూడా ఆయన అంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. మరి ముఖ్యంగా పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్లను ఆయన ఇప్పటివరకు తీసుకోలేదట. దీన్ని బట్టి చూస్తే ఆయన ఆరోగ్యం విషయంలో ఏ రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అర్థం చేసుకోవచ్చు .

అయితే శృతి మించిన ఎక్సర్ సైజ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.. ప్రస్తుతం గుండెపోటు మరణాలు చాలా ఎక్కువగా దీనివల్లే జరుగుతున్నాయి కాబట్టి సరైన భోజనం తీసుకుంటూ .. సరైన నిద్ర అలాగే ఒత్తిడికి దూరంగా ఉంటే ఎంతటి వారైనా ఇలా మహేష్ బాబులా కనిపించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news