అదానీ లంచాలపై బీజేపీ సమాధానం చెప్పాలి : ఏఐసీసీ చీఫ్ ఖర్గే

-

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదానీ లంచాల ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికాలోని పలు కంపెనీల ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి అదానీ గ్రూప్ బెనిఫిట్ పొందిందని ఆయనపై అగ్రరాజ్యంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేవలం అమెరికాలోనే కాకుండా ఇండియాలో సైతం పలు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు వేల కోట్లు లంచాలు ఇచ్చి అదానీ గ్రూప్ ఎనర్జీ లబ్ది పొందిందని యూఎస్ ఓ నివేదిక విడుదల చేసింది.

తాజాగా ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవ్వగా.. రాజ్యసభలో అదానీ అంశంపై చర్చ చేపట్టాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చైర్మన్ జగదీప్ ధన్కర్‌ను కోరారు. అందుకు ఆయన అంగీకరించలేదని తెలుస్తోంది.
అదానీ అవినీతి అంశం దేశాన్ని ప్రభావితం చేస్తోంది, అదానీకే ప్రధాని మోడీ మద్దతు సైతం ఇస్తున్నారు.అదానీ అవినీతిపై విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news