BREAKING : మధ్యాహ్నం 1 గంటలకు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తుంది. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ పేపర్ల లీకేజీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై టీఎస్పీఎస్సీ స్పందిస్తూ.. 5 పరీక్షల ను రద్దు చేసింది.
ఇక తాజాగా TSPSC పేపర్ లీక్ అంశంపై…తెలంగాణ సీఎం KCR సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. అటు ప్రగతి భవన్ కు TSPSC మాజీ చైర్మన్ ఘంట చక్రపాణి వచ్చారు. ప్రస్తుత TSPSC బోర్డును రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్నయం తీసుకునేందుకు ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేయనున్నారు సీఎం KCR.