ఏపీ విద్యార్థులకు శుభవార్త..రాగిజావ స్థానంలో పిల్లలకు చిక్కీలు

-

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం అందిస్తున్న రాగిజావ స్థానంలో చిక్కిలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒంటిపూట బడుల్లో భాగంగా ఉ.11:00కే మధ్యాహ్న భోజనం పెడుతున్నందుకు వేరేగా రాగిజావను అందించే బదులు చిక్కిలను ప్రతిరోజు ఇవ్వాలని అధికారులకు సూచించింది.

ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రతిరోజు చిక్కిలు పంపిణీ చేయాలనుకున్నారు. రాగిజావ పంపిణీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొనసాగించనున్నారు. కాగా, AP EAPCET లో ఇంటర్ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా వల్ల గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించగా, ఈ ఏడాది 25% ఇంటర్ మార్కుల వెయిటేజీని పునరుద్ధరించారు. EAPCET లో వచ్చే 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులకి కేటాయిస్తారు. ఇంటర్ లో ఎస్సీ, ఎస్టీలకు 40%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి. కాగా, తెలంగాణలో వెయిటేజిని పూర్తిగా తొలగించి ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news