సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు హిట్ ట్రాక్ మీద దూసుకుపోతున్నారు. ‘అఖండ’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు ‘అఖండ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం. జార్జియాలో కీలక షెడ్యూల్‌ను ఇప్పటికే పూర్తి చేసుకున్న చిత్ర బృందం, త్వరలో హైదరాబాద్‌లో భారీ సెటప్‌లో యాక్షన్ సీన్ చిత్రీకరించనుంది. తాజా సమాచారం ప్రకారం, జూన్ మొదటి వారంలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రత్యేక సెట్లో ఏకంగా వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సీన్ చిత్రీకరణ జరగనుంది. బోయపాటి ఈ సీన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, స్వయంగా సెట్స్ పర్యవేక్షిస్తున్నారట.
‘అఖండ’ అద్భుత విజయంతో రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి నాగసాధు గెటప్‌లో అలరించనున్నాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సనాతన ధర్మం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఫస్ట్ లుక్ లేదా టీజర్ రూపంలో అప్డేట్ రానుందని తెలుస్తోంది.