సమంత రేంజ్ మామూలుగా లేదుగా..!

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన సొంత నిర్ణయాలతో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతున్న ఈమె ఒక్కొక్క సినిమాకు రూ.5 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. నటిగానే కాకుండా మంచి సహృదయరాలు కూడా.. ఎంతోమంది మహిళలను, చిన్నపిల్లలను ఆదుకుంటూ మరి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రూ.300 కోట్లకు పైగా ప్రాపర్టీ కూడబెట్టినట్లు సమాచారం.

ఈమె దగ్గర ఉండే ఐదు ఖరీదైన వస్తువులు కూడా ఈమె లగ్జరీని గుర్తిస్తాయని చెప్పవచ్చు. ఇక సమంత విషయానికి వస్తే ఈమెకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ అనే చెప్పాలి. డిఫరెంట్ అవుట్ ఫిట్లతో ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకుంది. వేసుకునే చెప్పుల నుంచి బ్రాస్లెట్ , హ్యాండ్ బ్యాగ్, మెడలో నెక్లెస్ , డ్రెస్ ఇలా ప్రతీదీ కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే సమంత దగ్గర ఉన్న ఐదు ఖరీదైన వస్తువుల గురించి ఇప్పుడు చూద్దాం.

సమంత మలానో బ్లహానిక్స్ అనే బ్రాండ్ కు చెందిన చెప్పులను ఉపయోగిస్తుంది. వీటి ధర సుమారుగా లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈమె దగ్గర గుచ్చి కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దీని ధర అక్షరాలా రూ.1.40లక్షలు ఉంటుందని సమాచారం. అంతేకాదు మరో విలువైన హ్యాండ్ బ్యాగ్ కూడా ఆమె దగ్గర ఉంది. దీని ధర సుమారుగా రూ.2.5 లక్షలు.. ఇక సమంతకు సాకీ వరల్డ్ బ్రాండ్ అనే ఒక సొంత దుస్తుల కంపెనీ కూడా ఉంది. ఎక్కువగా ఆమె తన బ్రాండ్ దుస్తులను ఉపయోగిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈమె దగ్గర ఒక ఖరీదైన ఇల్లు కూడా ఉంది. ఎంతో విలాసవంతంగా ఉండటమే కాదు లగ్జరీ గా కూడా వుంటుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news