ఇండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ లో చాలా దారుణంగా ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ టీం కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ బ్యాట్ పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి. అంతలా వన్ సైడ్ బ్యాటింగ్ తో మ్యాచ్ లను గెలిపించేవాడు. అయితే ఈ సీజన్ లో హిట్ మ్యాన్ గా పేరొందిన రోహిత్ శర్మ ఎందుకో టెన్షన్ టెన్షన్ గా ఆడడం చాలా మ్యాచ్ లలో గమనించాము. అస్సలు క్రీజులో కొంతసేపు నిలబడితే ఆటోమేటిక్ గా పరుగులు వస్తాయి. కానీ అంతసేపు ఉండలేక త్వరగానే వికెట్ ఇచేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ముంబై తరపున రోహిత్ శర్మ ఆడిన 10 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో మాత్రమే గెలిపించి మిగిలిన 5 మ్యాచ్ లలో ఓటమికి కారణం అయ్యాడు.
ఇక బ్యాటింగ్ లోనూ అన్ని మ్యాచ్ లలోనూ ఆడిన రోహిత్ కేవలం 18.4 యావరేజ్ తో 184 పరుగులను చేశాడు. ఓపెనర్ గా దిగే రోహిత్ శర్మ మ్యాచ్ లో 20 కన్నా తక్కువ పరుగులు చేయడం ముంబై ఆత్మయులకు కారణమని చెప్పాలి.