తెలంగాణలో విజయం సాధించి.. సౌత్ లో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తాం-ఎంపీ జీవీఎల్

-

తెలంగాణలో విజయం సాధించి.. సౌత్ లో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బీజేపీ ఎంపీ జీవీఎల్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనువుగా లేవని.. కాంగ్రెస్ మెజారిటీతో అధికారం ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. బిజెపిపై ప్రజల్లో వ్యతిరేకత లేదు… గత ఎన్నికల్లో బిజెపి 36 శాతం ఓట్లు సాధిస్తే ఇపుడు అదే 36 శాతం ఓట్లు సాధించామని పేర్కొన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కర్ణాటకలో మొత్తం 28 స్థానాల్లో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మోడి నాయక్తవం కోసం ప్రజలు ఓట్లు వేస్తారు.. ఒక రాష్ట్రం ఫలితాలు మరో రాష్ట్రoపై ప్రభావితం ఉండదు.. కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయినా, తెలంగాణ లో విజయం సాధించి సౌత్ లో కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్.

Read more RELATED
Recommended to you

Latest news