సెక్స్ వర్క్ తప్పు కాదు : ముంబై కోర్టు తీర్పు

-

సెక్స్ వర్క్ చేయడం పై ముంబై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిబంధనల ప్రకారం సెక్స్ వర్క్ చేయడం తప్పు కాదని ముంబై కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో చేయడం నేరమని తెలిపింది. ఓ ఇంట్లో జరిగిన రైడ్స్ లో అరెస్ట్ అయిన 34 ఏళ్ల సె క్స్ వర్కర్ ను విడుదల చేయాలని ఆదేశించింది.

ఆమె సంరక్షణ కోసం ఏడాది పాటు ఇంట్లోనే ఉంచాలని మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. స్వేచ్ఛగా తిరగడం, నివసించడం ప్రాథమిక హక్కు అని కోర్టు పేర్కొంది. తమ తీర్పును ఎవరు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ముంబై కోర్టు. కాగా, సెక్స్‌ వర్క్‌ చేయడంపై ముంబై కోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు కోర్టు తీర్పును సమర్థిస్తుంటే.. మరికొందరైతే విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news