తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గద్దర్ కూతురు కి కీలక పదవీ

-

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్పర్సన్  గా గద్దర్ కూతురు  డాక్టర్ గుమ్మడి.వి. వెన్నెల ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Vennela
Vennela

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, వర్క్ షాపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో చైర్మన్ గా అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమించింది. ఇక 2023 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మాత్రం వెన్నెలకు టికెట్ ఇవ్వలేదు.  తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు చైర్ పర్సన్ గా కీలక బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news