తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఎలాంటి డ్రెస్ ధరించినా సరే గ్లామర్ గా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలోనే తరచూ రకరకాల దుస్తుల్లో తనదైన శైలిలో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే నట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ.. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ కూడా వైవిద్యమైన పాత్రలలో పూర్తిగా మెరిసింది. అలా గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె.. విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించింది.
అనగనగా ఒకదీరుడు అనే సినిమా ద్వారా విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్గా నటించినా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు మలయాళం సినిమాలలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ఒకవైపు యాంకర్ గా కూడా పేరు దక్కించుకొని.. మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ కి సంబంధించిన ఈవెంట్స్ లో చురుకుగా పాల్గొంటూ అందరితో సన్నిహితంగా ఉంటూ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇక ఇటీవలే యూట్యూబ్లోకి కూడా ఎంటర్ అయిన మంచు లక్ష్మీ.. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ యూట్యూబ్లో పలు వీడియోలు కూడా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా ఉండగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. డిజైనర్ డ్రెస్ లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది. ప్రస్తుతం అబీదాబీలో ఐఫా అవార్డ్స్ ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్ వేడుకకు నటీమణుల మతులు పోగొట్టే విధంగా దర్శనమిస్తూ అదరగొట్టేస్తున్నారు ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ కూడా ఒక సైడ్ స్లీవ్ లెస్ షోల్డర్, మరొక సైడ్ థైస్ అందాలు చూపిస్తూ హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.
Rocking the Day 2 @IIFA Rocks 2023!#iifa2023 #abudhabi pic.twitter.com/9xISA9c1RT
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 28, 2023