లోక్‌సభ ఎలక్షన్ ముందు జనాభా లెక్కింపు లేనట్టే.!

-

భారత్​లో పదేళ్లకోసారి నిర్వహించే జనాభా గణన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు చేపట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈసారి 2020 ఏప్రిల్‌ 1 – సెప్టెంబరు 30 మధ్య ఈ లెక్కింపును చేపట్టాల్సి ఉండగా కొవిడ్‌  కారణంగా ఆ కార్యక్రమం నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.

2024 ఏప్రిల్‌-మే మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. వచ్చే అక్టోబరు నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో, జనాభా గణన ప్రక్రియలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్నందున ఆ సమయంలో జనాభా లెక్కింపును చేపట్టడానికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే జనాభా లెక్కింపు ఉండే అవకాశం ఉందని చెప్పారు.

ఈసారి డిజిటల్‌ జనాభా గణనగా ఉంటుంది. పౌరులు సొంతంగా వివరాలను సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన స్వీయగణన పోర్టల్‌ను సంబంధిత యంత్రాంగం రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news