రోజురోజుకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కాయగూరలు కొందామని మార్కెట్కు వెళ్తున్న సామాన్యులు ధరలు చూసి తట్టుకోలేక ఖాళీ సంచులతో ఇంటికి తిరుగు పయనమవుతున్నారు. కూరల్లో అత్యంత ముఖ్యమైన టమాట, మిర్చిల ధరలు అన్నింటికంటే ఎక్కువగా ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు. చాలా వరకు అవి లేకుండా కూరలు చేస్తూ మమ అనిపిస్తున్నారు.
అయితే..ఈ తరుణంలో తాజాగా కర్ణాటకలో టమాటా దొంగలు హల్ చల్ సృష్టించారు. హసన్ లో టమోటా దోచుకెళ్లినట్లు ఓ రైతు ఫిర్యాదు చేశాడు. హళేబీడు పోలీసులకు రైతు ధాహ్రానీ ఫిర్యాదు చేశాడు. తన ఫాంహౌస్ లో ఉంచిన 90 బాక్సుల టమోటాలను దోచుకెళ్లినట్లు ఫిర్యాదు చేశాడు సదరు రైతు. దొంగ తనంకు గురైన టమాటా విలువ రూ. 2.7 లక్షలు ఉంటుందన్నాడు రైతు. టమాటా రైతు ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. ప్రస్తుత మార్కెట్ లో టమోటా కేజీ రూ. 100 దాటడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.