పాపికొండల యాత్రకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ జల వనరులశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వర్షంతో పాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.

యాత్ర ప్రారంభమయ్యే తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పాపికొండల యాత్రకు రావాలని అనుకునేవారు కొన్ని రోజులు ఆగి తర్వాత రావాలని అధికారులను సూచించారు. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే పాపికొండల యాత్రకు రావాలని చెబుతున్నారు. వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని వెల్లడించారు.