దేవిశ్రీకి – అనిల్ రావిపూడికి అక్క‌డే చెడిందా…?

-

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ గ‌తంలో ఉన్నంత జోష్‌లో ఉండ‌డం లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు మ్యూజిక్ ఇవ్వాలంటే దేవిశ్రీనే ఫ‌స్ట్ ఆప్ష‌న్‌. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎందుకో గాని దేవీ కంటే బాలీవుడ్‌, కోలీవుడ్‌, మ‌ల్లూవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే దేవిశ్రీకి…  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య విభేదాలు తలెత్తాయ‌న్న వార్త ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబోలో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సాంగ్ వ‌స్తోంది. దేవి ఇచ్చిన ట్యూన్స్ అనిల్‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేద‌ట‌. అందుకే సరిలేరు నీకెవ్వ‌రు నుంచి ఎలాంటి సాంగ్ రావడం లేద‌ని…  దేవి తీరుపై చిత్ర యూనిట్ కోపంతో ఉంద‌న్న వార్త‌లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దేవీ ఇప్ప‌టికే రెండు మూడు సార్లు కంపోజ్ చేసి ఇచ్చిన ట్యూన్స్ అనిల్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే ట్యూన్స్ బాగా లేట్ అవుతున్నాయంటున్నారు.

ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో తీస్తున్న సినిమా కాబట్టి, గత చిత్రాల మాదిరి కాకుండా ట్యూన్స్ కొత్తగా ఉండాలని పదే పదే దేవీని అనిల్ అడుగుతున్నా దేవి లైట్ తీస్కొంటున్న‌ట్టుగా ఉంద‌న అనిల్ ఫైర్ అవుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు సంక్రాంతికే వ‌స్తోన్న అల వైకుంఠపురంలో సాంగ్‌లు, ప్రోమోల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే అనిల్ దేవీపై చాలా ఫైర్ అవుతున్నాడ‌న్న వార్త‌లు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news