హీరో కిరణ్ అబ్బవరం తండ్రికి పెను ప్రమాదం !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరంకు ఊహించని షాక్‌ తగిలింది. ఎస్ ఆర్ కళ్యాణ మండపం ఫేమ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి జయచంద్రారెడ్డి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ చెర్లోపల్లి పెట్రోల్ పంప్ వద్ద హీరో కిరణ్ అబ్బవరం తండ్రి జయచంద్రారెడ్డి యాక్సిడెంట్‌ జరిగింది.

జయచంద్రారెడ్డి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టిందట. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ప్రమాదంలో జయచంద్ర రెడ్డి వెన్నెముకకు గాయం కావడంతో సిటీ స్కానింగ్ అనంతరం రాయచోటి వైద్యులు కడప రిమ్స్ కు రెఫర్ చేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news